సత్య వెలుగు న్యూస్ , పుత్తూరు, అక్టోబర్ 22:పుత్తూరు మున్సిపాలిటీ 17వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. వార్డులోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి అమ్మను బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో 17వ వార్డులో టీడీపీ ప్రచార కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.




