📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో ఎస్‌ఐ శివశంకర్‌ అవగాహన కార్యక్రమం

నాయుడుపేటలో ఎస్‌ఐ శివశంకర్‌ అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

-ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి
-గంజాయి, మత్తు పదార్థాల నివారణకు కట్టుబడి ఉండాలి
-సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని నాయుడుపేట పట్టణ ఎస్‌ఐ ఎం. శివశంకర్ కోరారు.

గురువారం సాయంత్రం నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీని సందర్శించిన ఎస్‌ఐ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

విద్యార్థులు ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలకు పాల్పడితే వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగం గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు పదార్థాలను విక్రయించే, వినియోగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.

గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రజలు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి సహకరించాలని ఎస్‌ఐ ఎం. శివశంకర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!