📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట వైకాపా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారు

నాయుడుపేట వైకాపా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారు

📰 Generate e-Paper Clip

-నామినేషన్‌ దాఖలు.. అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెర..

-కిలివేటి సంజీవయ్య చొరవతో ఎన్నికల బరిలోకి..

-మున్సిపల్‌ పీఠమే లక్ష్యంగా వైకాపా అడుగులు..

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్‌:నాయుడుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ ఖరారయ్యారు. ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంతో అభ్యర్థి ఎంపికపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైకాపా ఎన్నికల బరిలో ముందడుగు వేసింది.

మాజీ ఏఎంసీ చైర్మన్‌ తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి సతీమణి రాజేశ్వరమ్మను అభ్యర్థిగా నిలిపేందుకు సూళ్లూరుపేట నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సంజీవయ్య సూచన మేరకే పోటీకి నిర్ణయం తీసుకున్నట్లు రాజేశ్వరమ్మ కుమారుడు, సీనియర్‌ నాయకుడు తంబిరెడ్డి మోహన్‌రెడ్డి గతంలో వెల్లడించారు.

తాజాగా రాజేశ్వరమ్మ నామినేషన్‌ సమర్పించడంతో పార్టీ నిర్ణయం కార్యరూపం దాల్చింది. అభ్యర్థిత్వం ఖరారు కావడం, నామినేషన్‌ దాఖలు పూర్తవడంతో నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.

ఇక వార్డులవారీగా అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజా సమస్యలపై ప్రచార కార్యాచరణ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ అనంతరం వివిధ పార్టీల ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!