-టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా..
-2019–2024 మధ్య ప్రతిపక్షంలోనూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లా..
-వాకిరి వెంకటేశ్వర్లు, 17వ వార్డు NDA కూటమి అభ్యర్థి
నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చానని నాయుడుపేట మున్సిపాలిటీ 17వ వార్డు NDA కూటమి అభ్యర్థి వాకిరి వెంకటేశ్వర్లు తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని అమరా గార్డెన్, అగ్రహారపేట ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తూ, ఎన్నిక ఏదైనా పార్టీ అభ్యర్థుల విజయానికి నిరంతరం కృషి చేశానని పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేశానని తెలిపారు. తన సేవలను గుర్తించిన రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఉత్తమ కార్యకర్త అవార్డును కూడా అందుకున్నానని వెల్లడించారు.
ప్రతిపక్షంలోనూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లా
2019–2024 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నానని వెంకటేశ్వర్లు తెలిపారు. గౌరవ సభ, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, విద్యుత్ చార్జీల పెంపుపై ధర్నాలు, బాబు షూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ వంటి కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ విధానాలను ప్రజలకు వివరించానని పేర్కొన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో పార్టీ చేపట్టిన ‘బాబుతో నేను’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ చేసిన ఆరోపణలను ప్రజలకు వివరించామని తెలిపారు.
ఆ సమయంలో నాయుడుపేటలో వార్డు అధ్యక్షుడిగా, 49వ నంబర్ బూత్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన డా. నెలవల విజయశ్రీకి 300కు పైగా ఓట్ల మెజారిటీ సాధించేందుకు కృషి చేశానని పేర్కొన్నారు.
నా సేవలను గుర్తించి అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు
పార్టీ పట్ల తనకున్న నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణను గుర్తించి నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో NDA కూటమి తరఫున 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు వాకిరి వెంకటేశ్వర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీకి, మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే తన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచిన శిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి, నాయుడుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ రఫీ, మల్లెమాల రాఘవరెడ్డి కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కోసం నిరంతరం కష్టపడిన తనకు 17వ వార్డు నుంచి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని వాకిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

