నాయుడుపేట, అక్టోబర్ 1, సత్య వెలుగు న్యూస్:
పట్టణ అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.226 కోట్లతో కేపీ కెనాల్ అనుసంధాన తాగునీటి పథకం చేపట్టనున్నట్లు తెలిపారు. వెంకటగిరి రోడ్డులో స్వర్ణముఖి వరకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అర్హులకు కొత్త పింఛన్లు, టిడ్కో ఇళ్లతో పాటు కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




