📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట మున్సిపల్‌ పీఠంపై వైకాపా దృష్టి.. రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

నాయుడుపేట మున్సిపల్‌ పీఠంపై వైకాపా దృష్టి.. రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసిన తంబిరెడ్డి రాజేశ్వరమ్మ

📰 Generate e-Paper Clip

-అవినీతి రహిత పాలనే ధ్యేయం.. నాయుడుపేట పురాభివృద్ధే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

-ప్రజాసేవే పరమావధి.. సేవ చేసే భాగ్యం కల్పించాలన్న రాజేశ్వరమ్మ

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి: కిలివేటి సంజీవయ్య

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, నాయుడుపేట మున్సిపాలిటీలో అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. పట్టణంలో డ్రైనేజీ, సురక్షిత తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మున్సిపాలిటీకి వచ్చే ప్రతి రూపాయిని ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని ఆయన అన్నారు. ప్రజాసేవకు అంకితమైన తంబిరెడ్డి జనార్దన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదరించి, తంబిరెడ్డి రాజేశ్వరమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్రజాసేవకు అవకాశం కల్పించండి: రాజేశ్వరమ్మ

చైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ మాట్లాడుతూ, నాయుడుపేట పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడాన్ని దైవానుగ్రహంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో చైర్‌పర్సన్‌గా ఎన్నికైతే మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు మెరుగైన సేవలే మా లక్ష్యం: తంబిరెడ్డి మోహన్‌రెడ్డి

టీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత తంబిరెడ్డి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందని పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే రాజేశ్వరమ్మ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, గ్రామీణ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్‌ యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి పాలూరు దశరథరామిరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కటకం దీపిక, జిల్లా లీగల్‌ సెల్‌ కార్యదర్శి చదలవాడ కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ సద్దయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!