నాయుడుపేట, అక్టోబర్ 4, 2026 — సత్య వెలుగు న్యూస్:
ప్రత్యక్ష విక్రయ విధానం (డైరెక్ట్ సెల్లింగ్) ద్వారా నిరుద్యోగులకు వ్యాపార అవకాశాలను కల్పిస్తూ, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వెస్టేజ్ సంస్థ పనిచేస్తోందని క్రౌన్ డైరెక్టర్ పట్టపు రవి తెలిపారు.
నాయుడుపేట పట్టణంలోని వెస్టేజ్ కార్యాలయంలో ఆదివారం వెస్టేజ్ వ్యాపారంలో విజయాలు సాధించిన నాయకులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నారుపోలూరు గ్రామానికి చెందిన విల్లపూ హృదయ్ కుమార్ 8% స్థాయిని, నాయుడుపేట పట్టణానికి చెందిన బట్టేపాటి శివానందం గోల్డ్ డైరెక్టర్ హోదాను సాధించిన సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు.
ప్రతి నెలా వెస్టేజ్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధిస్తున్న నాయకులను గుర్తించి సన్మానించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పట్టపు రవి తెలిపారు. కష్టపడి పనిచేస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే ప్రతి ఒక్కరికీ ఇటువంటి విజయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు.
నిత్యజీవితంలో అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను వినియోగించడంతో పాటు, కంపెనీ వ్యాపార విధానాన్ని అర్థం చేసుకుని అదనపు ఆదాయాన్ని పొందేందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
వెస్టేజ్ వ్యాపారం ద్వారా ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవనానికి మార్గాలను అన్వేషించవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించి, వారు తమ జీవితాల్లో ముందుకు సాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వెస్టేజ్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




