📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఊనుగుంటపాలెం ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తన్నమాల శైలజమ్మ!

ఊనుగుంటపాలెం ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తన్నమాల శైలజమ్మ!

📰 Generate e-Paper Clip

–భార్య గెలుపు కోసం భర్త ప్రచారం..

-గతంలో సర్పంచిగా చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ మద్దతు కోరుతున్న కుటుంబ సభ్యులు

సత్య వెలుగు న్యూస్ – కోట మండలం:కోట మండలంలోని ఊనుగుంటపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన్నమాల శైలజమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తన్నమాల శైలజమ్మ భర్త మాట్లాడుతూ.. గతంలో తాను గ్రామ సర్పంచిగా పోటీ చేసి విజయం సాధించానని, తన పదవీకాలంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. గతంలో గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం తన భార్య శైలజమ్మకు ప్రజలు మద్దతు తెలిపి ఎంపీటీసీగా గెలిపించాలని కోరారు.

కోట మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అభ్యర్థి విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఊనుగుంటపాలెం సెగ్మెంట్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.

ఎన్నికల ప్రచారంతో ఊనుగుంటపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!