📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుఅమలు కాని సూపర్ సిక్స్ పథకాలు.. ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే: పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి మూడేల...

అమలు కాని సూపర్ సిక్స్ పథకాలు.. ప్రజల మద్దతు వైఎస్సార్‌సీపీకే: పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి మూడేల భారతి లక్ష్మారెడ్డి!

📰 Generate e-Paper Clip

-కరాలపాడు, తుమ్మలచెరువు, వీరాపురం గ్రామాల్లో విస్తృత ఎన్నికల ప్రచారం

సత్య వెలుగు న్యూస్ – పిడుగురాళ్ల:కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వైఎస్సార్‌సీపీ పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి మూడేల భారతి లక్ష్మారెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుపై గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.

శుక్రవారం పిడుగురాళ్ల మండలంలోని కరాలపాడు, తుమ్మలచెరువు, వీరాపురం గ్రామాల్లో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థానికులు ఆమెకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా భారతి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ల సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకోవడంతో పాటు, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నామినేషన్ల అనంతరం ఎన్నికల ప్రచారానికి కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు.

తాను ప్రజల్లో ఒకరిగా, గ్రామాల బిడ్డగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో చింత సుబ్బారెడ్డి, చల్లా పిచ్చిరెడ్డి, మూడేల వెంకటేశ్వరరెడ్డి, గొట్టిముక్కల మట్టారెడ్డి, మీట్టా జంగమయ్య, వెన్నా సిరి ప్రతాప్ రెడ్డి, మాబు, అల్లు పిచ్చిరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!