📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడునరసరావుపేటలో 1టౌన్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

నరసరావుపేటలో 1టౌన్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, నరసరావుపేట: వ్యాపారస్తులంతా ఐక్యతతో, ఆరోగ్యకరమైన పోటీతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అత్తులూరి సుబ్బారావు (సుబ్బు) పిలుపునిచ్చారు.

నరసరావుపేట 1టౌన్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా పచ్చిపులుసు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పురావూరి శ్రీనివాసరావు, కోశాధికారిగా చిలకల కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా సుబ్బారావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కిరాణా వ్యాపారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!