📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాంట్రాక్టు విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

కాంట్రాక్టు విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలి

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట,: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి, తెలంగాణ తరహాలో రూ.48 వేల జీతం అందించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పీఆర్సీ సంప్రదింపుల కమిటీని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు జేఎల్‌ఎంలను ఏఎల్‌ఎంలుగా ప్రమోట్ చేయాలని కోరారు.

కార్మికుల సమస్యలపై ఈ నెల 21 నుంచి చేపట్టిన బైక్ ర్యాలీ–చైతన్య యాత్ర 27న వెంకటగిరి నుంచి నాయుడుపేట, కాళహస్తి మీదుగా తిరుపతికి చేరుకుంది. బీసీ రేట్ కార్మికులకు అర్హతల ఆధారంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పదోన్నతులు ఇవ్వాలని నాయకులు కోరారు.

కార్యక్రమంలో ముజఫర్ అహ్మద్, సుమన్, ఎన్. నాదముని రెడ్డి, జ్యోతిబసు, సుబ్రహ్మణ్యం, కుమార్, రవి, మురళి, లోకేష్, రఘు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!