📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆకాశాన్ని అంటుతున్న టపాసుల ధరలు!

ఆకాశాన్ని అంటుతున్న టపాసుల ధరలు!

📰 Generate e-Paper Clip

-దీపావళి పండుగ వేళ సామాన్యుల జేబులకు చిల్లు..

-మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిన బాణసంచా ధరలు

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: దీపావళి పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. దీపావళి పండుగలో టపాసులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఏడాది నాయుడుపేట పట్టణంలో టపాసుల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. టపాసులు కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళ్తున్న వినియోగదారులకు అక్కడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

నాయుడుపేట పట్టణంలోని ALCM గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రంలో* బాణసంచా ధరలు భారీగా ఉన్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి కొద్దిపాటి టపాసులు కొనుగోలు చేయాలన్నా వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు.

టపాసుల ధరలు విన్న సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేక నిరాశతో వెనుదిరుగుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. పండుగ ఆనందాన్ని ఆస్వాదించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు పెరిగిన ధరలు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు టపాసుల ధరలను పర్యవేక్షించి, వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా టపాసుల ధరలను నియంత్రించాలి. ధరల పట్టికలను ఏర్పాటు చేసి, అధిక ధరలకు విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పట్టణ ప్రజలు కోరుతున్నారు.*

పండుగ అంటే ఆనందం పంచుకోవాలి కానీ, టపాసుల ధరలు చూసి సామాన్యుల ఆనందం ఆవిరైపోయే పరిస్థితి రాకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!