📄 ePaper
Wednesday, April 15, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
HomeHealthచిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు, తెల్ల జుట్టు రాకుండా కాపాడే చిట్కాలు, జాగ్రత్తలేంటో తెలుసుకోండి

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణాలు, తెల్ల జుట్టు రాకుండా కాపాడే చిట్కాలు, జాగ్రత్తలేంటో తెలుసుకోండి

📰 Generate e-Paper Clip

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం (Premature Grey Hair) ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. జీవనశైలి, ఆహారం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా నివారించాలి? తెలుసుకుందాం.

చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది?

​మన జుట్టుకు మెలనిన్ అనే పిగ్మెంట్ రంగు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు తెల్లగా మారుతుంది.

చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణాలు

1️⃣ పోషకాహార లోపం

శరీరానికి అవసరమైన Vitamin B12, Iron, Zinc, Copper వంటి పోషకాలు తక్కువగా ఉంటే జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

2️⃣ అధిక ఒత్తిడి (Stress)

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం జుట్టుపై పడుతుంది.

3️⃣ జన్యు కారణాలు

కుటుంబంలో తల్లిదండ్రులకు లేదా పెద్దలకు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఉంటే అదే సమస్య పిల్లల్లో కూడా రావచ్చు.

4️⃣ కెమికల్ ప్రాడక్ట్స్ వాడకం

జుట్టుకు తరచుగా డైలు, జెల్స్, షాంపూలలోని కెమికల్స్ వాడితే జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంటుంది.

5️⃣కాలుష్యం మరియు జీవనశైలి

పొగ త్రాగడం, నిద్రలేమి, కాలుష్య వాతావరణం కూడా జుట్టు తెల్లబడటానికి కారణం అవుతుంది.

ఆరోగ్య సమస్యలు

కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు లేదా ఆటోఇమ్యూన్ సమస్యల వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సరైన ఆహారం

జుట్టు ఆరోగ్యానికి లోపలి నుంచి పోషణ అందడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యం.

  1. విటమిన్ బి12: దీని లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంది. ఇది జుట్టుకు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జుట్టు రంగు కోల్పోతుంది. విటమిన్ బి12 రోలం పాలు, పెరుగు, గుడ్లు, మాంసం వంటి వాటిని మీ డైట్‌లో భాగం చేసుకోండి.
  2. ఐరన్, కాపర్: ఈ రెండూ పోషకాల లోపం వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావచ్చు. అందుకే ఇవి ఎక్కువగా ఉండే ఆకుకూరలు (పాలకూర), జీడిపప్పు, బాదంపప్పు వంటి డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు తీసుకోవాలి. కాపర్ మెలనిన్ ఉత్పత్తికి చాలా అవసరం.
  3. యాంటీ ఆక్సిడెంట్స్: బెర్రీలు, గ్రీన్ టీ, ఉసిరి, తాజా పండ్లు వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి జుట్టును రక్షిస్తాయి.

జీవనశైలి మార్పులు

  • ఒత్తిడి తగ్గించుకోవడం: ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా సమస్యల్ని దూరం పెట్టొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా మీకు నచ్చిన ఏదైనా పని ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
  • ధూమపానం మానేయండి: ఈ రోజుల్లో చాలా మందికి స్మోకింగ్ అలవాటు ఉంది. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి.. జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ తగ్గి తెల్లబడుతుంది. అందుకే స్మోకింగ్ అలవాటుకు గుడ్ బై చెప్పేయండి.
  • తగినంత నిద్ర చాలా ముఖ్యం: చాలా మందిని నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే కీలకం. రోజుకు 7 – 8 గంటల గాఢ నిద్ర జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • తగినంత నీరు తాగడం: నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. జీవక్రియ విధులకు నీరు తాగడం చాలా కీలకం. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగండి.

    జుట్టు సంరక్షణ (Hair Care)

    1. కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ తగ్గించండి: ఎక్కువగా రసాయనాలు ఉండే షాంపూలు, హెయిర్ డైలు, బ్లీచింగ్ వాడటం తగ్గించాలి. వీలైనంత వరకు సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూల్ని వినియోగించండి.
    2. జుట్టుకు వేడిని తగ్గించండి: హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటనర్లు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనపడి రంగు కోల్పోతుంది. ఈ మెషీన్లు వాడటం వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యి జుట్టు దెబ్బతింటుంది.
    3. సహజ నూనెలు: కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
    4. కెమికల్ డైలు (Chemical Dyes): అమ్మోనియా ఎక్కువగా ఉండే హెయిర్ కలర్స్ వాడటం వల్ల ఉన్న నల్ల జుట్టు కూడా తెల్లబడే అవకాశం ఉంది.
    5. వేడి నీళ్లు: తల స్నానానికి మరీ వేడిగా ఉండే నీటిని వాడకండి. గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటితో తలస్నానం చేయడం ఉత్తమం.

    ముఖ్యమైన గమనిక

    ఒకవేళ మీరు కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే అది కేవలం వయసు వల్ల వచ్చే మార్పు కాకపోవచ్చు. శరీరంలో ఏదైనా తీవ్రమైన విటమిన్ లోపం ఉందేమో తెలుసుకోవడానికి ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం. వారు రక్త పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి సరైన మందుల్ని, పాటించాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!