📄 ePaper
Monday, August 31, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుRTI దరఖాస్తుపై కావలి హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం సమాచారం ఇవ్వడంలో జాప్యంపై ,జాతీయ RTI కోఆర్డినేటర్...

RTI దరఖాస్తుపై కావలి హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం సమాచారం ఇవ్వడంలో జాప్యంపై ,జాతీయ RTI కోఆర్డినేటర్ సాల్మన్‌రాజ్ ఆగ్రహం

📰 Generate e-Paper Clip

RTI దరఖాస్తుపై కావలి హౌసింగ్ అధికారుల నిర్లక్ష్యం

సమాచారం ఇవ్వడంలో జాప్యంపై జాతీయ RTI కోఆర్డినేటర్ సాల్మన్‌రాజ్ ఆగ్రహం

నెల్లూరు: సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలైన దరఖాస్తుకు సకాలంలో సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ, కావలి హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కావలి నియోజకవర్గంలోని గృహనిర్మాణ పథకాల వివరాల కోసం 2026 ఏప్రిల్ 11న RTI సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసినట్లు జాతీయ RTI కోఆర్డినేటర్ సాల్మన్‌రాజ్ తెలిపారు. అయినప్పటికీ సమాచారం అందించడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

2017–2026 మధ్య మంజూరైన ఇళ్లు, పూర్తయిన గృహాలు, వివిధ దశల్లో విడుదలైన నిధులు, 4వ దశ నిధులు, లబ్ధిదారుల వివరాలు, పథకాల వారీ ఖర్చులు, మండలం/నియోజకవర్గం వారీగా జరిగిన పనుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

RTI దరఖాస్తుపై జరిగిన జాప్యాన్ని రాష్ట్ర హౌసింగ్ మిషన్ కమిషనర్ వెంటనే పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సాల్మన్‌రాజ్ కోరారు.

“ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలి. RTI చట్టం లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం. దరఖాస్తుదారులకు నిబంధనల ప్రకారం సమాచారం అందించాలి” అని ఆయన పేర్కొన్నారు.

                           సాల్మన్‌రాజ్
                  జాతీయ RTI కోఆర్డినేటర్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!