📄 ePaper
Thursday, September 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కొత్త ‘పింఛన్ల’కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కొత్త ‘పింఛన్ల’కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

📰 Generate e-Paper Clip

అమరావతి, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కోసం ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్‌ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ల దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణతో పాటు ఆన్‌లైన్‌ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు.

📅 దరఖాస్తుల ప్రక్రియ ఇలా..

  • సెప్టెంబర్‌ 7–16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ-కేవైసీ
  • సెప్టెంబర్‌ 17–21: ప్రాథమిక అర్హతల పరిశీలన
  • సెప్టెంబర్‌ 22–24: భౌతిక, శాఖాపరమైన ధ్రువీకరణ
  • సెప్టెంబర్‌ 25–26: బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ
  • అనంతరం అర్హులైన వారికి దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.

👥 ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు తదితర అర్హత కలిగిన వివిధ వర్గాల వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద సుమారు 28 కేటగిరీలకు పింఛన్లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

📍 ఎక్కడ దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్న వారు తమకు సంబంధించిన గ్రామ/వార్డు సచివాలయంలోని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను సమర్పించిన అనంతరం అధికారులు వివరాలను నమోదు చేసి రసీదు అందజేస్తారు.

గమనిక: దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 16తో ముగియనున్నందున అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

— సత్య వెలుగు న్యూస్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!