📄 ePaper
Wednesday, September 9, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరూ.8 కోట్ల పంచాయతీ భూమి కబ్జా ఆరోపణలు

రూ.8 కోట్ల పంచాయతీ భూమి కబ్జా ఆరోపణలు

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు,  సత్య వెలుగు న్యూస్: మిట్ట హరిజనవాడ ఎగువ ప్రాంతంలోని సుమారు 3.5 ఎకరాల పబ్లిక్ సర్వీస్ భూమి కబ్జాకు గురైందని మాజీ ఎన్‌డీసీసీబీ చైర్మన్, చిల్లకూరు గ్రామ కాపురస్తుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెళ్లకూరు ఎంపీడీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

35 ఎకరాల లేఅవుట్‌లో నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల కోసం కేటాయించిన 3.5 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని తెలిపారు.

భూమిపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని గ్రామ ప్రజల అవసరాలకు వినియోగించాలని ఎంపీడీవోను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!