📄 ePaper
Sunday, September 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు

ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు

📰 Generate e-Paper Clip

నరసరావుపేట: చదువుకు ప్రయాణ ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఇద్దరు విద్యార్థులకు తన సొంత నిధులతో సైకిళ్లు అందజేశారు.

‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా 4వ వార్డు పనసతోటలో పర్యటించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు జెసిమా భాను, ఆసిఫ్ తమ ప్రయాణ సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెండు సైకిళ్లు కొనుగోలు చేసి వారికి అందించారు.

విద్యార్థుల చదువుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!