📄 ePaper
Saturday, September 19, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పల్నాడుసేంద్రియ, జీవన ఎరువులతో అధిక దిగుబడులు: ఏరువాక శాస్త్రవేత్తలు

సేంద్రియ, జీవన ఎరువులతో అధిక దిగుబడులు: ఏరువాక శాస్త్రవేత్తలు

📰 Generate e-Paper Clip

బెల్లంకొండ: సేంద్రియ, జీవన ఎరువులను వినియోగించడం ద్వారా భూసారం పెరగడంతో పాటు సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని నరసరావుపేట ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. నగేష్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి.వి. సత్య గోపాల్ తెలిపారు. శుక్రవారం బెల్లంకొండలో కంది పంట క్షేత్ర సందర్శన నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. కంది పంటలో మొక్కలు అధిక ఎత్తు పెరిగితే పైభాగాన్ని కత్తిరించడం ద్వారా పక్క కొమ్మలు పెరిగి దిగుబడి మెరుగుపడుతుందని తెలిపారు. పత్తిలో ఎరువుల యాజమాన్యం, పురుగు నివారణ చర్యలు పాటించాలని, మిరపలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవ నియంత్రణ పద్ధతులను వినియోగించాలని సూచించారు.

కార్యక్రమంలో క్రోసూరు ADA టీ. మస్తానమ్మ, బెల్లంకొండ, రాజుపాలెం మండలాల AO పి. వెంకట నరసయ్య, VAAలు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!