📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన సత్య వెలుగు న్యూస్ ప్రతినిధుల బృందం

అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన సత్య వెలుగు న్యూస్ ప్రతినిధుల బృందం

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్,పెళ్లకూరు, సెప్టెంబర్ 25:
సూళ్లూరుపేట నియోజకవర్గం సత్య వెలుగు న్యూస్ రిపోర్టర్ల బృందం శుక్రవారం పెళ్లకూరు మండలంలోని వివిధ శాఖల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మండలంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర, అధికార యంత్రాంగంతో సమన్వయం, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

ప్రజలకు సంబంధించిన సమస్యలను వాస్తవాలను నిర్ధారించుకుని బాధ్యతాయుతంగా వార్తల రూపంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు సత్య వెలుగు న్యూస్ కృషి చేస్తుందని రిపోర్టర్ల బృందం పేర్కొంది. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా అధికారులు, రిపోర్టర్లు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!