📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం — ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం — ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, సెప్టెంబర్ 25: మహిళల భద్రత, సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు.

నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహిళా ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో మొత్తం 1,506 అర్జీలు అందగా, ఆయా సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో భాగమని విజయశ్రీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా డ్వాక్రా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బయటకు రాలేని 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి గౌరవప్రదంగా పింఛన్లు అందించాలని సచివాలయ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేద మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ, ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, నాయకులు పసల గంగా ప్రసాద్, పోట్లపూడి రాజేష్, జివిఆర్ నాయుడు, జువ్వలపాటి మస్తాన్, నానబాల సుబ్బారావు, నిత్యా కృష్ణారెడ్డి, చెందేటి సుజాత, చిట్టేటి రేవతి, మొండెం బాబు, పలుకూరు ముత్యాలయ్య, హైమావతి, వినుకొండ ధనంజయ, నాగరాజు, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా, మేనేజర్ ఉరుకుందమ్మ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పలువురు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!