పెళ్లకూరు: పోషణ్ మాహ్లో భాగంగా పాలచూరు ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. అలాగే నాల్గవ శనివారం నిర్వహించే అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అందుతున్న పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలు, ఎదుగుదల పర్యవేక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సహాయకుల సేవలను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు యద్దల నరేంద్ర రెడ్డి అభినందించి, వారిని శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ కె. ఉమామహేశ్వరి, సూపర్వైజర్ శైలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




