📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
Homeఎడిటోరియల్సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

సూళ్లూరుపేట హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట, సత్య వెలుగు న్యూస్: సూళ్లూరుపేట పట్టణంలోని హోలీక్రాస్ సర్కిల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు.

ఈ ఘటనతో హోలీక్రాస్ సర్కిల్ వద్ద కొద్దిసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!