సత్య వెలుగు న్యూస్,పెళ్లకూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆదివారం ఉదయం 9 గంటలకు చిల్లకూరు గ్రామంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం తెలిపారు.
సమావేశానికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తొలుత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అనంతరం మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒబ్బు వెంకటరత్నం పిలుపునిచ్చారు.

