📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, కిలివేటి

కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, కిలివేటి

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, పెళ్లకూరు: చిల్లకూరు గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరామర్శించారు.

ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహకరిస్తామని, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!