📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeజాతియంహైవేలపై టోల్‌ ఇక ఆగకుండానే.. కొత్త విధాన

హైవేలపై టోల్‌ ఇక ఆగకుండానే.. కొత్త విధాన

📰 Generate e-Paper Clip

(బిజినెస్)

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 , సత్య వెలుగు న్యూస్: దేశంలోని హైస్పీడ్‌ జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ఇకపై టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ‘మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో’ టోలింగ్‌ విధానాన్ని తీసుకురానుంది. ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ గుర్తింపు సాంకేతికతల ద్వారా వాహనం కదులుతుండగానే టోల్‌ రుసుం ఆటోమేటిక్‌గా వసూలు చేసే విధానం అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు

ఈ విధానాన్ని గుజరాత్‌లోని ఎన్‌హెచ్‌-48పై ఇప్పటికే అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరకుండా చేయడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. రాబోయే 4, 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్‌ఫీల్డ్‌ యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రహదారులకు కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి.

కృత్రిమ మేధతో రహదారుల నిర్మాణం

భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్‌ను ముందుగానే అంచనా వేసి రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం ఆటోమేటెడ్‌, ఇంటెలిజెంట్‌ మెషిన్‌-ఎయిడెడ్‌ నిర్మాణ సాంకేతికతను వినియోగించనున్నారు. దీంతో నిర్మాణ ప్రక్రియలో ఖచ్చితత్వం పెరగడంతో పాటు రహదారుల నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉంటుంది.

పర్యావరణానికి ప్రాధాన్యం

కొత్త హైవే ప్రాజెక్టుల్లో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రహదారుల మధ్య భాగాల్లో, వంతెనల కింద మొక్కలు పెంచడం, బిందు సేద్యం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం, వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలను ప్రాజెక్టు రూపకల్పనలోనే చేర్చడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

వేగవంతమైన ప్రయాణంతో పాటు ఆధునిక సాంకేతికత, రహదారి నాణ్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా భవిష్యత్‌ జాతీయ రహదారులను తీర్చిదిద్దడమే ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!