చౌడేపల్లి, సెప్టెంబర్ 28 – సత్య వెలుగు న్యూస్:
మండల కేంద్రమైన చౌడేపల్లిలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జాతీయ నాయకులు గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్యాంకు రెడ్డప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా గుర్రం జాషువా, భగత్ సింగ్ జీవిత చరిత్రలను, దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం కోసం గుర్రం జాషువా చేసిన కృషిని, దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటాన్ని విద్యార్థులకు వివరించారు.
వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, డాక్టర్ చంద్ర, బస్టాండ్ శేఖర్, నరసింహులు, చంగల్ రాయులు, హాస్టల్ వార్డెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

