📄 ePaper
Sunday, October 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో గాంధీజీకి ఘన నివాళులు , నుడా పార్క్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి...

నాయుడుపేటలో గాంధీజీకి ఘన నివాళులు , నుడా పార్క్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నాయుడుపేట నుడా పార్క్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, టౌన్ పార్టీ అధ్యక్షులు 786 రఫీ, టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పసల గంగా ప్రసాద్, శ్రీ పోలేరమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ నానాబాల సుబ్బారావు, క్లస్టర్ ఇన్‌చార్జ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అలాగే ఆర్యవైశ్య సంఘం నాయకులు గూడూరు కిషోర్, నారాయణ, నాగరాజు, మాజీ కౌన్సిలర్లు మైలారి రాజశేఖర్, చిట్టి రేవతి, కరీంభాయి చెంచయ్యతో పాటు పార్టీ నాయకులు ఇమ్మడి శెట్టి వెంకటేశ్వర్లు, GVR నాయుడు, మైలారి అశోక్, ఒబ్బు సురేష్, చిగురువాడ అశోక్, వినుకొండ ధనుంజయ, సులేమాన్, యచ్ఛా శ్రీనివాసులు, హైమవతి, SJ రాజేష్, పెద్దగారి సుబ్బు, పెద్దగారి గిరి, బాల సుబ్రహ్మణ్యం, పులుకూరు ముత్యలయ్య, పెళ్లకూరు గోపాల్ కృష్ణ, డక్కిలి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!