📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట పురపాలక సంఘంలో గాంధీజీకి ఘన నివాళులు

నాయుడుపేట పురపాలక సంఘంలో గాంధీజీకి ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

–గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ ఫజులుల్లా, మేనేజర్ ఉరుకుందమ్మ

నాయుడుపేట, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, మేనేజర్ ఉరుకుందమ్మ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, ఆయన పాటించిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి ఆశయాలను గుర్తుచేసుకున్నారు. సమాజంలో శాంతి, సామరస్యం, సేవాభావం పెంపొందించేందుకు గాంధీజీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

గాంధీజీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని జాతిపితకు ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!