దొరవారిసత్రం, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి, అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేంద్రతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ దేశానికి అందించిన సేవలు, సత్యం, అహింస, శాంతి వంటి ఆయన సిద్ధాంతాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
గాంధీజీ ఆశయాలను ప్రజలు ఆచరించాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సేవాభావం పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

