📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అన్నమయ్యచారాల పంచాయతీలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

చారాల పంచాయతీలో ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్:
చౌడేపల్లి మండలంలోని చారాల పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

చారాల పంచాయతీ పరిధిలోని కురపల్లికి చెందిన అలీ ఖాన్ (42) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి పెళ్లి కార్యక్రమానికి దాచేపల్లికి వెళ్లి అనంతరం ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం.

శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో అలీ ఖాన్ కనిపించాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అలీ ఖాన్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!