📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరోసునూరు పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ

రోసునూరు పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభ

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు, అక్టోబర్ 2 — సత్య వెలుగు న్యూస్:
పెళ్లకూరు మండలం బంగారంపేట సచివాలయం పరిధిలోని రోసునూరు పంచాయతీలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.

ఈ గ్రామ సభలో టీడీపీ నాయకులు సత్యం రాజు, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలు, సూచనలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!