📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపు

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్:
పర్యావరణ పరిరక్షణలో చెట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు.

శనివారం జి.డి. నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు నాగేశ్వర రాజు వ్యవసాయ క్షేత్రాన్ని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలో శ్రీగంధం మొక్కను నాటి, నీరు పోశారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు పెద్ద ఎత్తున వృక్షారోపణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు. నాటిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఎంపీ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!