📄 ePaper
Tuesday, November 10, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలి ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు...

ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలి ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి డిమాండ్

📰 Generate e-Paper Clip

నాయుడుపేట, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్:
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనకు గల కారణాలను పూర్తిస్థాయిలో వెలికితీసి, ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి డిమాండ్ చేశారు.

శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో పలువురు కార్మికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా అధికారులు నిర్ధారించాల్సి ఉంది.

ఈ సందర్భంగా పట్టపు రవి మాట్లాడుతూ.. తడ మండలంలోని మాంబట్టు సెజ్, మేనకూరు సెజ్‌లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయని, ఆయా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక మంది కార్మికులు తక్కువ వేతనాలకు పరిశ్రమల్లో పనిచేస్తున్నారని, వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను పరిశ్రమల్లో సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన డిమాండ్లు

  1. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.కోటి తక్షణ ఆర్థిక సహాయం అందించాలి.
  2. మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
  3. మృతి చెందిన కార్మికుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి.
  4. పరిశ్రమల్లో కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
  5. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల జీవితాలకు పూర్తి భద్రత కల్పించాలి.

ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని పట్టపు రవి కోరారు.

ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి వెంకటస్వామి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పట్టపు రవి, నాయుడుపేట పట్టణ అధ్యక్షులు బట్టేపాటి శివానందం, ఓజిలి మండల అధ్యక్షులు కార్వేటినగరం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!