📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో గఫూర్

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో గఫూర్

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: మండల పరిధిలోని దుర్గసముద్రం, పెద్దయల్లకుంట్ల గ్రామ పంచాయతీల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను చౌడేపల్లి మండల డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ విధానాన్ని పరిశీలించారు. క్లాప్ మిత్రులకు వర్మీ కంపోస్ట్ తయారీ, నిర్వహణపై పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం స్వయంగా వర్మీ తొట్టెల్లో వానపాములను విడుదల చేశారు.

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, తడి చెత్తను సద్వినియోగం చేసుకుని ప్రకృతి ఎరువులను తయారు చేయాలని డిప్యూటీ ఎంపీడీవో సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతతో పాటు చెత్తను సంపదగా మార్చే విధానాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తరించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు సుభాషిణి, లోకేష్ కుమార్, పారిశుధ్య సిబ్బంది, క్లాప్ మిత్రలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!