📄 ePaper
Monday, November 9, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లిలో రేబీస్ భయం - వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వైద్యాధికారి...

చౌడేపల్లిలో రేబీస్ భయం – వీధి కుక్కల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వైద్యాధికారి మోనా

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 8 సత్య వెలుగు న్యూస్:పట్టణంలోని స్థానిక చాకలి వీధిలో ఒకే రోజు ఒక పిచ్చికుక్క వీరంగం సృష్టించి ఏడు మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి మోనా ఆదేశాల మేరకు ఏఎన్ఎం రుక్మిణమ్మ నేతృత్వంలో ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రుక్మిణి మాట్లాడుతూ.. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉన్నందున ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిచ్చికుక్క గాయపరిచిన వారికి అవసరమైన యాంటీ రేబీస్ వ్యాక్సిన్‌లు, మందులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే, ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో కూడా కుక్కల సంచారం ఎక్కువగా ఉందనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. పట్టణంలో పెరిగిపోయిన వీధి కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!