📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజైలు నుంచి పెళ్లకూరు ప్రజలకు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి లేఖ: ఈ విజయం చారిత్రాత్మకం

జైలు నుంచి పెళ్లకూరు ప్రజలకు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి లేఖ: ఈ విజయం చారిత్రాత్మకం

📰 Generate e-Paper Clip

​పెళ్లకూరు,నవంబర్ 08 ,సత్య వెలుగు న్యూస్: నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉంటూనే పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానాన్ని 1,708 ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (కేఎస్‌ఆర్) జైలు నుంచి ప్రజలకు ఒక భావోద్వేగ ప్రకటన ద్వారా లేఖ రాశారు.ఈ విజయం చాలా గొప్పదని,ఈ విజయాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.అక్రమ కేసులు,భయానక వాతావరణం,ఓటర్లపై బెదిరింపులు ఉన్నప్పటికీ ఓట్లు వేసి గెలిపించిన తీరుకు నియోజకవర్గ ప్రజలకు దండం పెట్టి దండాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా కోసం రాత్రింబవళ్లు కష్టపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు,సహనుభూతిపరులకు,బంధుమిత్సాదులకు మరియు ప్రచారాన్ని ముందుకు నడిపించిన అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక ప్రణామాలు తెలిపారు.ఇప్పుడు రాష్ట్రమంతా పెళ్లకూరు వైపే చూస్తోందని,రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జైలు నుంచి పోటీ చేసిన ఒక జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించి పెళ్లకూరు ఓటర్లు చరిత్ర సృష్టించారని కొనియాడారు.ఈ విజయం తనకు మాత్రమే కాదని,జగనన్నకు పెళ్లకూరు ప్రజలు ఇచ్చిన అపూర్వమైన కానుక అని స్పష్టం చేశారు.2029లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సాగుతున్న ప్రయాణంలో ఇది మొదటి మెట్టు అని అభివర్ణించారు.
​పోలీసుల వేధింపులు,అధికారుల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ధైర్యంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే ఓటు వేయాలనుకుని వేయలేకపోయిన వారికి కూడా ధన్యవాదాలు చెప్పారు.ఆ రోజు నరకాసుర వధతో దీపావళి వస్తే,ఈ రోజు పెళ్లకూరులో ప్రజాస్వామ్యం గెలవడంతో నిజమైన దీపావళి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.మండల ప్రజలందరూ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!