📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిన్నమాల ఎంపీటీసీ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ బల్లి ముత్యాలయ్య కృతజ్ఞతలు

విన్నమాల ఎంపీటీసీ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ బల్లి ముత్యాలయ్య కృతజ్ఞతలు

📰 Generate e-Paper Clip

సత్య వెలుగు న్యూస్, నవంబర్ 8: నాయుడుపేట మండల పరిషత్ ఎన్నికల్లో విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కార్న పద్మమ్మకు ఓటు వేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బల్లి ముత్యాలయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్న పద్మమ్మ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొని, ఆమెకు 500కు పైగా ఓట్లు సాధించేందుకు కృషి చేసిన కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే తనపై నమ్మకం ఉంచి ఎన్నికల బాధ్యతలను అప్పగించిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ, నెలవల రాజేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల సమయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు చూపిన ఐక్యత, సహకారం మరువలేనివని పేర్కొంటూ, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!