సత్య వెలుగు న్యూస్ – పుత్తూరు:తిరుపతి జిల్లా పుత్తూరు పరిధిలోని తిరుపతి–చెన్నై జాతీయ రహదారిపై మరాఠీ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు, యువకుడి ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

