పుత్తూరు, సత్య వెలుగు న్యూస్, అక్టోబర్ 21:
తిరుపతి జిల్లా పుత్తూరు మండల పరిధిలోని పుత్తూరు మున్సిపల్ ఎన్నికల బరిలో జై భీమ్ సేన తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్. మస్తానమ్మ బుధవారం అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, దళిత సింహం తాళ్లపాక దామును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తాళ్లపాక దాము మస్తానమ్మను ఆశీర్వదిస్తూ, ఆమె ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన జాతి బిడ్డకు అండగా నిలుస్తానని, తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చి సహాయం అందించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని ఆమెకు ప్రోత్సాహం అందించారు.
ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవర్ పి. రామచంద్రన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎస్ రఘు, జిల్లా ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, త్వరలో జై భీమ్ సేన తరఫున అభ్యర్థిగా పోటీ చేయనున్న రాజీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

