📄 ePaper
Monday, October 26, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగుంతకల్… ఇంకా ఎన్నాళ్లు ఈ సమస్యలు?

గుంతకల్… ఇంకా ఎన్నాళ్లు ఈ సమస్యలు?

📰 Generate e-Paper Clip

–తాగునీటి ఇబ్బందులు..

-రోడ్లపై భారీ లారీలు..

-వీధుల్లో చెత్త కుప్పలు!

సత్య వెలుగు న్యూస్, పుత్తూరు ,అక్టోబర్ 23: పట్టణంలో తాగునీటి నాణ్యత, భారీ లారీల రాకపోకలు, వీధుల్లో పేరుకుపోతున్న చెత్త, వర్షం కురిసినప్పుడు అండర్‌పాస్‌లలో నీరు నిలిచిపోవడం, రైల్వే గేటు వద్ద గంటల తరబడి నిరీక్షణ వంటి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టణంలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండటం, రహదారులపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. అలాగే యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితులు, పిల్లలకు తగిన ఆటస్థలాలు లేకపోవడం వంటి సమస్యలు కూడా చర్చకు వస్తున్నాయి.
ఈ సమస్యలను ప్రధాన అంశాలుగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన అంశాలుగా ప్రచారంలో వివరిస్తున్నారు.
“ఇక చాలు.. మార్పు మన ఓటుతోనే మొదలవుతుంది” అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తూ, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి అభ్యర్థి ప్రతిపాదించే ప్రణాళికలు, వాటి అమలు విధానాలపై ఓటర్లు దృష్టి సారించాలని స్థానిక ఎన్నికల ప్రచారంలో చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!