📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేట 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లు ప్రచార జోరు

నాయుడుపేట 22వ వార్డులో టీడీపీ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లు ప్రచార జోరు

📰 Generate e-Paper Clip

-అగ్రహారపేట, ఎల్‌.ఏ. సాగరం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పాలెం వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం అగ్రహారపేట, ఎల్‌.ఏ. సాగరం ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు.

సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వంలో, నాయుడుపేట మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారి శోభారాణి, మైలారి రాజశేఖర్ సూచనల మేరకు ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థన

ప్రచారంలో భాగంగా పాలెం వెంకటేశ్వర్లు ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డులో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల మెరుగుదలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రచారంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు

ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!