📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినాయుడుపేటలో రేపు రెజ్లింగ్ జిల్లా జట్టు ఎంపికలు

నాయుడుపేటలో రేపు రెజ్లింగ్ జిల్లా జట్టు ఎంపికలు

📰 Generate e-Paper Clip

-సీనియర్ పురుషులు, మహిళల విభాగాల్లో సెలెక్షన్స్‌

నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా రెజ్లింగ్ జట్టు ఎంపికలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు నాయుడుపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులంలో నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా రెజ్లింగ్ చైర్మన్ డాక్టర్ ఆదవరం అనుదీప్, కార్యదర్శి బి. ఉదయ్ కుమార్ తెలిపారు.

ఈ ఎంపికలు ట్రెడిషనల్ రెజ్లింగ్‌లో సీనియర్ పురుషులు, మహిళల విభాగాలకు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అర్హులైన క్రీడాకారులు నిర్ణీత సమయానికి ఎంపికల కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

పురుషుల విభాగం బరువు కేటగిరీలు

  • 57 కేజీలు
  • 65 కేజీలు
  • 74 కేజీలు
  • 86 కేజీలు
  • 97 కేజీలు
  • 118 కేజీలు

మహిళల విభాగం బరువు కేటగిరీలు

  • 50 కేజీలు
  • 53 కేజీలు
  • 57 కేజీలు
  • 62 కేజీలు
  • 68 కేజీలు
  • 76 కేజీలు

క్రీడాకారులకు ముఖ్య సూచనలు

  • ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా 20 సంవత్సరాలు పైబడినవారై ఉండాలి.
  • 18–19 సంవత్సరాల వయస్సు కలిగిన క్రీడాకారులు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి.
  • ప్రతి క్రీడాకారుడు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలి.
  • ఎంపికల కోసం మధ్యాహ్నం 2 గంటలకు నాయుడుపేట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులానికి చేరుకోవాలి.

మరిన్ని వివరాలకు సంప్రదించండి

📞 9000024837

తిరుపతి జిల్లా తరఫున రెజ్లింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు క్రీడాకారులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!