పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండల కో-ఆప్షన్ సభ్యుడిగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మల్లం విజయ్ ఎంపికయ్యారు. పలువురు కూటమి నాయకుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు సూర్యప్రకాష్, జనసేన పార్టీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త బాలుశెట్టి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి చైతన్య కృష్ణారెడ్డి, వేలూరు మురళిరెడ్డి, పేరం రమేష్ నాయుడు, పునబాక పోలయ్య తదితరుల సమక్షంలో ఈ నిర్ణయం వెలువడింది.
మండల అభివృద్ధికి కృషి చేస్తా: మల్లం విజయ్
ఈ సందర్భంగా మల్లం విజయ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పెళ్లకూరు మండల అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
తనకు సహకారం అందిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

