📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిక్షీరసముద్రం పంచాయతీ అభివృద్ధే లక్ష్యం!

క్షీరసముద్రం పంచాయతీ అభివృద్ధే లక్ష్యం!

📰 Generate e-Paper Clip

-అఖండ మెజార్టీతో గెలిపించండి: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అమ్ములు విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్ఎ, పుత్తూరు, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం క్షీరసముద్రం పంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమ్ములు గారు ప్రజలను ఓటు అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో తనకు అమూల్యమైన ఓటు వేసి, ఫ్యాన్ గుర్తుపై ముద్రించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.

పంచాయతీలో నెలకొన్న ప్రధాన సమస్యలైన వీధి దీపాల కొరత, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని అమ్ములు హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతూ, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని తెలిపారు.

ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధిస్తే, పంచాయతీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అమ్ములు ప్రజలను విజ్ఞప్తి చేశారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!