📄 ePaper
Tuesday, October 27, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికలవకూరు ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి బాలు.. బి-ఫారం సమర్పణ!

కలవకూరు ఎంపీటీసీ బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి బాలు.. బి-ఫారం సమర్పణ!

📰 Generate e-Paper Clip

పెళ్లకూరు,సత్య వెలుగు న్యూస్: కలవకూరు ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి బాలు తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తరఫున కేటాయించిన బి-ఫారాన్ని రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించారు. పార్టీ నాయకులు కోటి తుమ్ముల, గిరి రెడ్డిలతో కలిసి ఆయన బి-ఫారాన్ని అందజేశారు.

వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం బండి బాలుకు బి-ఫారం కేటాయించడంతో కలవకూరు ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఆయన అధికారిక అభ్యర్థిగా ముందుకు సాగుతున్నారు. బి-ఫారం సమర్పణతో నామినేషన్ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.

కలవకూరు ఎంపీటీసీ స్థానం నుంచి పోటీకి సిద్ధమైన బండి బాలు ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ పరిణామంతో స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!