📄 ePaper
Thursday, October 29, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిభారత రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో!

భారత రాజ్యాంగమే బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో!

📰 Generate e-Paper Clip

-సగుటూరు ఎంపీటీసీ బరిలో నాగిశెట్టి తులసమ్మ..

-ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..

ఓజిలి, సత్య వెలుగు న్యూస్: సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా నాగిశెట్టి తులసమ్మ పోటీ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమెకు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచారని ఆమె మద్దతుదారులు పేర్కొంటున్నారు.

మూడు దశాబ్దాలుగా బహుజనుల సమస్యలపై పోరాటం

నాగిశెట్టి తులసమ్మ భర్త నాగిశెట్టి రాజయ్య ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఓజిలి మండలంలో బడుగు, బలహీన వర్గాలకు ఏ సమస్య ఎదురైనా వారి పక్షాన నిలబడి పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిగా రాజయ్యకు గుర్తింపు ఉందని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తన భార్య నాగిశెట్టి తులసమ్మను బీఎస్పీ అభ్యర్థిగా సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పోటీలో నిలిపి, స్థానిక రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని రాజయ్య ప్రయత్నిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

తులసమ్మను ఎంపీటీసీగా గెలిపిస్తే సగుటూరు సెగ్మెంట్‌లోని ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వితంతువులు, మహిళలు, రైతులు, దివ్యాంగులకు అండగా నిలిచి, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.

రాజ్యాంగ విలువలే బీఎస్పీ అజెండా

భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణే తమ రాజకీయ లక్ష్యమని బీఎస్పీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. బహుజన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, స్థానిక సమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది తమ అభ్యర్థి లక్ష్యమని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సగుటూరు ఎంపీటీసీ సెగ్మెంట్ ఓటర్లు తమ అమూల్యమైన ఓటును బీఎస్పీ ఎన్నికల గుర్తు *ఏనుగు గుర్తుపై* వేసి నాగిశెట్టి తులసమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె మద్దతుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!