📄 ePaper
Friday, October 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి: బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ

ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి: బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ

📰 Generate e-Paper Clip

-ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి: బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ

-ఏకొల్లు, కుప్పారెడ్డిపాలెం గ్రామాల్లో విస్తృత ప్రచారం

సత్య వెలుగు న్యూస్ | దొరవారిసత్రం:

దొరవారిసత్రం మండలంలోని ఏకొల్లు ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న బందిలి భాగ్యమ్మ గురువారం ఏకొల్లు, కుప్పారెడ్డిపాలెం గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమకున్న ఓటు హక్కును శక్తివంతమైన ఆయుధంగా వినియోగించుకుని, రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని భాగ్యమ్మ కోరారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాట ఫలితంగా ప్రజలకు ఓటు హక్కు లభించిందని, ఆ ఓటును రాజకీయ అధికార సాధనకు ఎలా వినియోగించుకోవాలో మాన్యశ్రీ కాన్షీరాం బహుజన సమాజానికి మార్గనిర్దేశం చేశారని ఆమె వివరించారు.

ఛత్రపతి శివాజీ, సాహూ మహారాజ్, పెరియార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలు, సామాజిక న్యాయ పోరాటాల స్ఫూర్తితో మాన్యశ్రీ కాన్షీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలు రాజకీయంగా చైతన్యవంతులై అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ భర్త బందిలి శంకరయ్య దొరవారిసత్రం మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ, మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు, మహిళల సమస్యలు, హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో అధికార కూటమి అభ్యర్థికి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీగా బీఎస్పీ అభ్యర్థి బందిలి భాగ్యమ్మ ఏనుగు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని అభ్యర్థి విజయానికి మద్దతుగా ఓటర్లను కలిశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!