📄 ePaper
Monday, November 2, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యం: విద్యావేత్తలు

విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యం: విద్యావేత్తలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి, అక్టోబర్ 30 – సత్య వెలుగు న్యూస్:విద్యార్థులు కేవలం చదువుపైనే కాకుండా వ్యక్తిత్వ వికాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు ప్రముఖ విద్యావేత్తలు పిలుపునిచ్చారు. స్థానిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా గణితశాస్త్ర అధ్యాపకులు మునిరాజా మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని అన్నారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటూ సృజనాత్మక శక్తిని పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

భౌతికశాస్త్ర అధ్యాపకులు ఆనంద్ సార్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలని తెలిపారు. అసూయ, ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉంటూ మంచి గుణాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

అలాగే కల్యాణి భారతిలు మాట్లాడుతూ, జీవితంలో విజయాలు, అపజయాలు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా యోగా, ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, పట్టుదలతో మళ్లీ ప్రయత్నించి విజయం సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి, విలువైన సూచనలు చేసిన అధ్యాపకులను వారు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!