📄 ePaper
Sunday, November 8, 2026
spot_img
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిమీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించి గెలిపించండి! విన్నమాల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ

మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించి గెలిపించండి! విన్నమాల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ

📰 Generate e-Paper Clip

-విన్నమాల ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ విజ్ఞప్తి

సత్య వెలుగు న్యూస్ | నవంబర్ 2 | నాయుడుపేట: విన్నమాల ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కార్ణ పద్మమ్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం తిమ్మాజీ కండ్రిగ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రతి వీధిలో మహిళలు, ఓటర్లను కలుసుకుంటూ.. “మీ ఇంటి ఆడపడుచుగా, మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి” అంటూ విజ్ఞప్తి చేశారు.

అనంతరం కార్ణ పద్మమ్మ మాట్లాడుతూ.. మహిళల కష్టాలు, సమస్యలు తనకు తెలుసని, ఎన్నికల్లో గెలిచిన అనంతరం మహిళలు, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో, ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సహకారంతో విన్నమాల సెగ్మెంట్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు.

గ్రామాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొంటూ, సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచులు, సర్పంచులు లోడారి మనోహర్, పల్లేటి రమణయ్య, బత్తిన రమేష్, బల్లి ముత్యాలయ్య, బల్లి వెంకట కృష్ణయ్య, బల్లి సురేష్, దాసరి శ్రీనివాసులు, కార్ణ సుధాకర్, దాసరి యశోదమ్మతో పాటు మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, బూత్ కన్వీనర్లు, మహిళా, యువజన విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!