📄 ePaper
Saturday, November 7, 2026
spot_img
📄 ePaper
HomeISROశ్రీహరికోట ఇస్రోలో 97 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

శ్రీహరికోట ఇస్రోలో 97 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR)లో 97 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ SDSC SHAR/RMT/03/2026 ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్ 9వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

భర్తీ చేయనున్న పోస్టులు:

టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్-ఏ, నర్స్-బి, టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మన్-బి, ఫైర్‌మెన్-ఏ, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు:

పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, నర్సింగ్, డిగ్రీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు:

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్‌సైట్: https://www.isro.gov.in/SDSCRecruitment26.html

గమనిక: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 9, 2026.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

App Icon

Install SV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!